ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం యుద్దం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పార్టీ అధినేత, సీఎం జగన్ వార్ నానాటికీ ముదురుతోంది. నిత్యం ఏదో ఒక సమస్యపై వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా సీఎం జగన్‌కు రఘురామ లేఖలు సంధిస్తుండగా.. దానికి కౌంటర్‌గా ప్రభుత్వం తెరచాటు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.