హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

  • 4 years ago
భారత మార్కెట్లో ప్రసిది చెందిన హ్యుందాయ్ సంస్థ తన హ్యుందాయ్ ఐ 10 ను 2007 లో దేశీయ మార్కెట్లో తిరిగి విడుదల చేసింది. ఇది భారీ సంఖ్యలో అమ్ముడైన హ్యుందాయ్ సాంట్రోకు వారసురాలు. కాబట్టి ప్రారంభమైనప్పటి నుండి హ్యుందాయ్ ఐ 10 అమ్మకాలకు గొప్ప స్పందన వచ్చింది. అప్పుడు 2015 లో సంస్థ సాంట్రోను నిలిపివేసిన తరువాత, పోర్ట్‌ఫోలియోలో ఒక ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్, ఐ 10 మాత్రమే మిగిలింది.

ప్రస్తుతం ఇది హ్యుందాయ్ సంస్థ యొక్క రెండవ తరం మోడల్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్. అయితే కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో. హ్యుందాయ్ 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేసింది. ఇటీవల కొత్త గ్రాండ్ ఐ 10 టర్బో పెట్రోల్ కారును ఫస్ట్ డ్రైవ్‌ చేయడానికి అవకాశం లభించింది. ఈ వీడియోలో సరికొత్త గ్రాండ్ ఐ 10 టర్బో పెట్రోల్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

Recommended