Union Home Minister Amit Shah said that talks on the diplomatic and military level are underway to find a solution for the ongoing dispute with China at the Ladakh border.
సరిహద్దులో కయ్యానికి కాలుదువ్వుతోన్న డ్రాగన్ చైనా అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. చైనాతో ఉన్న సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. లడాఖ్ భూభాగంలో చైనా చొచ్చుకురావడంతో యుద్ధమేఘాలు అలుముకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమస్యపై ఇరుదేశాలు చర్చించుకొని పరిష్కరించుకుంటాయని తెలిపారు. ఇందులో మరో దేశం జోక్యానికి తావులేదని కుండబద్దలు కొట్టారు.