సీఎం వైఎస్ జగన్ హయాంలో రియల్ ఎస్టేట్ కుదేలు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. చంద్రబాబు సన్నిహితులపై ఐటీ దాడులను పక్కదారి పట్టించేందుకే పత్రికల్లో ఇలాంటి కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి... ల్యాండ్ పూలింగ్‌లో భూమి ఇవ్వలేదు అని కొన్ని గ్రామాలపై చంద్రబాబు కక్షకట్టారని ఆరోపించిన ఆయన.. ఆ గ్రామాలను రిజర్వ్ జోన్ పేరుతో ధరలు పడిపోయేలా చేశారన్నారు.