#happynewyear2020 : No Happy New year Save Amaravati | farmers protest with Rangoli
  • 4 years ago
Amaravati region farmers protest different way with Rangoli in Andhra Pradesh.
Amaravati farmers protest against Chief Minister YS Jagan Mohan Reddy's decision as three capital cities for the State.
#farmersprotest
#happynewyear2020
#2020NewYear
#Amaravatifarmers
#threecapitals
#apcmjagan
#SaveAmaravati

రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను నిరసిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన కొనసాగుతూనే వస్తోంది. కొత్త సంవత్సరాన్ని కూడా వారు తమ నిరసనలతోనే స్వాగతించారు. సేవ్ అమరావతి అంటూ ముగ్గులు వేశారు. రాజధాని అమరావతి పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది.

కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ.. ముగ్గులు వేయడం సాధారణం. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ముగ్గులు వేస్తుంటారు. బుధవారం తెల్లవారు జామున రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.. ఒక్క అమరావతి ప్రాంతంలో తప్ప. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు 15వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో.. కొత్త సంవత్సరానికి కూడా అదే తరహాలో స్వాగతం పలికారు.

సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ముగ్గులు వేశారు
Recommended