కాంగ్రెస్ పార్టీ కి చురకలంటించిన అమిత్ షా || Oneindia Telugu
  • 5 years ago
Amit Shah also hit out at the previous UPA governments and said that they wouldn't be able to name even five big decisions."The governments worked for 30 years and they still can't name 5 big decisions while the Modi government has worked for 5 years and has 50 big decisions to talk about," said Shah.
#amitshah
#bjp
#Article370
#JammuKashmir
#modi
#Congress
#upa

సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులతో ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అదే సమయంలో భారత్ అంటే ఏమిటో ప్రపంచదేశాలకు తెలిసి వచ్చిందని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా . ఇలాంటి దాడులు చేసేందుకు ఎంతో ధైర్యం ఉండాలని అది మోడీ నాయకత్వంలో జరిగిందని చెప్పారు. ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. యూపీఏ ప్రభుత్వంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలు కనీసం ఐదైనా చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వాలు దేశంలో 30 ఏళ్లు అధికారంలో ఉన్నాయని వారి హయాంలో తీసుకున్న ఐదు అతిపెద్ద నిర్ణయాలు చెప్పాలని సవాల్ చేశారు. ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఎంతో ధైర్యం సాహసం కావాలని అమిత్ షా పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై సర్జికల్ దాడులు చేయడం, జమ్మూ కశ్మీర్‌‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం తమ ప్రభుత్వ అతి పెద్ద విజయాలుగా చెప్పుకొచ్చారు అమిత్ షా. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని చెప్పిన అమిత్ షా... తమ నిర్ణయాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
Recommended