Ajay Devgn Buys Rolls Royce Cullinan Worth Rs 6.95 Cr

  • 5 years ago
Ajay Devgn buys Rolls Royce Cullinan worth Rs 6.95 cr, is the third Indian to own the luxury SUV.Actor Ajay Devgn has reportedly received his blue Rolls Royce Cullinan, worth Rs 6.95 crore. He is only the third Indian to have purchased the luxury SUV.
#ajaydevgn
#rollsroyce
#RollsRoyceCullinan
#chiranjeevi
#tollywood
#bollywood
#rrr
#akshaykumar
#SUV

లగ్జరీ కార్లు అంటే బెంజ్, బిఎండబ్ల్యు, ఆడి లాంటి పేర్లు చెబుతాం. కానీ ఈ లగ్జరీ కార్లను మించిన లగ్జరీ కారు రోల్స్ రాయిస్. ఈ కారు కలిగి ఉండటం అంటే ప్రత్యేకమైన స్టేటస్ కలిగి ఉన్నట్లు భావిస్తారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన, క్లాసిక్ కార్ల బ్రాండ్‌గా పేరొందిన దీన్ని దక్కించుకోవడం అంటే ఆశామాషీ కాదు. ఇండియాలో వేళ్లపై లెక్కించదగ్గ కొందరు ప్రముఖులు మాత్రమే రోల్స్ రాయిస్ కలిగి ఉన్నారు. తెలుగువారిలో ఈ కారు కలిగి ఉన్న ఒకే ఒక్క ప్రముఖుడు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే ఈ సంస్థ రోల్స్ రాయిస్ కుల్లినన్‌ పేరుతో ఎస్‌యూవీ మోడల్ విడుదల చేసింది. ఈ కారు కలిగి ఉన్న భారతీయుల క్లబ్‌లో నటుడు అజయ్ దేవగన్ చేరారు. ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధర 6.95 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు ఈ కారు ఇండియాలో బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, టి-సిరీస్ మొగల్ భూషణ్ కుమార్ మాత్రమే కలిగి ఉన్నారు.

Recommended