Skip to playerSkip to main contentSkip to footer
  • 11/30/2018
2.0 movie directed by S. Shankar. And After Watch 2.0 Actor Nani felt like a kid. He tweets #2point0 @rajinikanth sir @akshaykumar sir @shankarshanmugh sir BOXOFFICE KI DHIGIPODHII Felt like a kid after long time This is S-H-A-N-K-A-R-R-R-R
#2point0
#2point0review
#2Point0PublicTalk
#Rajinikanth
#2.Opublictalk
#Nani

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు మంచి పొజిషన్లో కొనసాగుతున్నాడు హీరో నాని. అయితే నాని ఒకప్పుడు సాధారణ ప్రేక్షకుల్లా క్యూ లైన్లో నిల్చుకుని చొక్కాలు చించుకుని మరీ సినిమాలు చూసిన వ్యక్తే. తనకు నచ్చిన సినిమా చూస్తే సగటు ప్రేక్షకుడిలా ఎగ్జైట్ అవ్వడంతో పాటు తనలోని సంతోషాన్ని, నచ్చకపోతే ఆ కోపాన్ని సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాలని నానికి కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం అతడు సెలబ్రిటీ కాబట్టి అలాంటివి చేయలేని పరిస్థితి. కానీ 2.0 సినిమా చూసిన తర్వాత తన సెలబ్రిటీ స్టేటస్ పక్కన పెట్టి తన నిజస్వరూపం చూపడంతో పాటు ఆనందంతో బరస్ట్ అయిపోయాడు నాని.
2.0 చిత్రాన్ని గురువారం రాత్రి సెకండ్ షో చూసిన అనంతరం నాని ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ అదరగొట్టారంటూ తన అభిమానం వ్యక్తం చేయడంతో పాటు ‘‘బాక్సాఫీసుకు దిగిపోద్ది'' అంటూ తనలోని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Recommended