Telangana Elections 2018 : మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై 2శాతమే స్టాంప్ డ్యూటీ : కాంగ్రెస్| Oneindia
  • 5 years ago
Congress working president Revanth Reddy slashed CM KCR for not having delivered the promises he made. If given a chance,Revanth said that congress would bring in a great administration to all sections of people."water, funds, employment was not the slogan of the people but it was the slogan of TRS" said Revanth. KCR family had played with people's sentiments accused Revanth.
#TelanganaElections2018
#kcr
#ktr
#RevanthReddy
#congress

నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల నినాదం కాదని అది టీఆర్ఎస్ నినాదమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొని జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణ తీసుకొస్తామన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు.కేవలం ప్రజల భావోద్వేగాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, స్వయం పాలనే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. కేసీఆర్ మనవడు ఏ సన్న బియ్యంతో అయితే అన్నం తింటాడో.. అదే సన్న బియ్యంతో పిల్లలు అన్నం తినేలా చేస్తామని కేటీఆర్ చెబుతున్నాడని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.... కేసీఆర్ మనవడు దీనికేమైనా కొలబద్దనా అని ప్రశ్నించారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు మనవడిని తీసుకెళ్లడంపై అభ్యంతరం తెలిపారు రేవంత్ రెడ్డి. కేటీఆర్‌ తనయుడిని రోల్ మోడల్‌గా చేసి చూపించే ప్రయత్నం చేస్తోందని రేవంత్ విమర్శించారు. తనకున్న ఒక్క కూతురి నిశ్చితార్థానికి తాను హాజరుకాకుండా కేసీఆర్ పెద్ద ప్రయత్నమే చేశారన్నారు. ఢిల్లీ నుంచి లాయర్లు పిలిపించుకుని బెయిల్ దక్కకుండా చూడాలనే ప్రయత్నం చేశారని రేవంత్ మండిపడ్డారు. అదేమి రాక్షసానందమో తనకు అర్థం కావడం లేదని అన్నారు.
Recommended