Telangana Elections 2018 : కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి | Oneindia Telugu

  • 5 years ago
first list creating tension in congress party. cadre opposes the high command decision on first list. protestants demanding for tickets, in this scenario first list may take turn into change.
#TelanganaElections2018
#Congress
#CongressFirstList
#trs
#TelanganaAssemblypolls
#constituency

కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంచాయితీ ఇంకా తెగలేదు. ఎన్నికలు సమీపిస్తున్నా కూడా హైకమాండ్ ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. అభ్యర్థులను తేల్చలేక సతమతమవుతోంది. ఈ క్రమంలో ప్రకటించిన తొలిజాబితా కూడా వివాదాస్పదంగా మారింది. పార్టీ టికెట్లు దక్కనివారు బహిరంగంగానే ఆందోళనలకు దిగుతున్నారు. మరోవైపు టికెట్ల ఖరారులో వారసత్వ రాజకీయాలకు, కొన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారని కార్యకర్తలు మండిపడుతున్నారు. బీసీలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించలేదని వాపోతున్నారు. అదలావుంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటే... ఒకే కుటుంబం నుంచి ఇద్దరి చొప్పున టికెట్లు కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు . మరోవైపు ఎన్నికలు సమీపిస్తుంటే అభ్యర్థుల ఎంపికలో నిదానంగా వ్యవహరించడమేంటని ఫైరవుతున్నారు. తొలిజాబితా అస్తవ్యస్తంగా ఉందని నిరసనలు వెల్లువెత్తడంతో అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఈనేపథ్యంలో ఫస్ట్ లిస్ట్ మార్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. అయితే తొలిజాబితాను మార్చుకుంటూ ఉంటే మిగతా స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

Recommended