Telangana Elections 2018 : Congress Final List : బీసీ ఓట్ల కోసం ఆర్.కృష్ణయ్యకు కాంగ్రెస్ లో చోటు
  • 5 years ago
The Congress released its last list of six candidates for the Telangana assembly election Sunday. The party had initially released a list of 65 candidates, followed by 10 & 13 candidates in other lists. Now tdp candidate R. Krishnaiah got a ticket from congress.
#TelanganaElections2018
#R.Krishnaiah
#congress
#ElectionCampaign
#mahakutami

అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఫైనల్ లిస్ట్ ఖరారు చేసింది. మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ పెద్దలు.. తాజాగా మరో ఆరుగురితో నాలుగో జాబితా రిలీజ్ చేశారు. అయితే ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కాంగ్రెస్ జాబితాలో చోటు దక్కడం చర్చానీయాంశంగా మారింది. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తో జట్టుకట్టి మహాకూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్ పెద్దలకు ఆది నుంచి టికెట్ల పంపిణీలో తలనొప్పి తప్పలేదు. అటు మిత్రపక్షాలకు సర్దుబాటు చేయలేక, ఇటు సొంతగూటి నేతలకు సర్దిచెప్పలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు పొత్తులు ఖరారయి కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీచేసేందుకు అంగీకారం కుదిరింది. దీంతో మూడు దఫాలుగా 88 మంది అభ్యర్థులను ప్రకటించినా.. మరో ఆరు స్థానాలకు అభ్యర్థుల ఖరారు విషయంలో తంటాలు పడ్డారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. సోమవారం నాటితో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో ఆదివారం రాత్రి ఆరుగురు అభ్యర్థులను డిక్లేర్ చేశారు.
Recommended