• 7 years ago
బావలు సయ్యా అంటూ టాలీవుడ్ని అలరించి ఆకులు మేయించిన ఒకప్పటి మేటి ఐటమ్ గాళ్ సిల్క్ స్మిత. హీరోయిన్ వేషాలకోసం వచ్చిన విజయలక్ష్మీ ఇక్కడ పోటీలో స్మిత గా మారి వ్యాంప్ పాత్రలలో తనదైన ముద్రవేసి ఆ తర్వాత అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడింది. తన మేని ఊపులతో టీనేజి కుర్రాళ్ళ నుండి తాతల దాకా అందరికీ రిమ్మతెగులు పుట్టించిన ఆ మేటి ఐటమ్ గాళ్ ని తెలుగు పరిశ్రమ పట్టించుకోక పోయినా బాలీవుడ్ మాత్రం గుర్తించింది.
ఈ చిత్రంలో అసలు సిల్క్ స్మిత సినీ రంగ ప్రవేశం, ఆతర్వాత ఆమె జీవిత గమనం, తర్వాత రెండో పెళ్ళి వాడిని పెళ్ళిపేరుతో అట్టిపెట్టుకోవటం చివరకు నమ్మిన వాడే నాటకీయ పరిణామాల మధ్య స్మిత ఆత్మహత్యను మీడియాకి తెలియజేయటం అన్నీ ఇందులో ఉంటాయట. అసలు ఆమె ఆత్మహత్య చేసుకుందా?లేక ఇది హత్యా? ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు ఏమిటి? ఆందోళనా! పరిశ్రమలో ఉన్న అవకాశ వాదమా లేక ఆశించిన అందలం అందక విలువైన జీవితం చాలించిందా అన్నవి ఇందులో ప్రధాన అంశాలుగా చెప్పవచ్చని తెలుస్తోంది.

Recommended