ఇది నా లవ్ స్టోరి సినిమా రివ్యూ
  • 6 years ago
Idi Naa Love Story is Telugu romantic film, produced by Prakash SV, starring Tarun and Oviya. The film is a remake of the 2013 hit Kannada film, Simple Agi Ondh Love Story. This movie hits theatres on Feb 14th.

హీరో తరుణ్ గతంలో లవర్ బాయ్‌గా ప్రేక్షకులను అలరించాడు. కానీ కొద్దికాలంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమైపోయాడు. తాజాగా కన్నడంలో ఘన విజయం సాధించిన సింపుల్ ఆగి ఓందు లవ్ అనే సినిమా రీమేక్‌‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు రమేష్ గోపి రూపొందించిన ఫీల్‌గుడ్ ప్రేమకథ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
అభిరామ్ (తరుణ్) యాడ్ ఫిలిం డైరెక్టర్. తన చెల్లెలు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపే విషయంపై మాట్లాడానికి తన కాబోయే బావ చెల్లెలు శృతితో మాట్లాడానికి ఓ గ్రామానికి అభిరామ్ వెళ్తాడు. కానీ శృతికి బదులు అభినయ (ఒవియా హెలెన్)ను కలుసుకొంటాడు. తొలి చూపులోనే అభినయతో ప్రేమలో పడుతాడు. కొద్ది సమయంలోనే వారిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు.
తమ జీవితంలో జరిగిన ప్రేమ వైఫల్యాల (బ్రేకప్‌) గురించి అభిరామ్, అభినయ ఒకరికొకరు చెప్పుకొంటారు. అలా వారి మధ్య ప్రేమ బలపడుతుంది. అంతా సవ్యంగా జరుగుతుందనుకొంటుండగానే అభినయ ఫిర్యాదు చేయడంతో అభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ క్రమంలో అభినయ గురించి ఓ భయంకరమైన విషయం తెలుస్తుంది?
అభినయ గురించి తెలిసిన భయంకర వాస్తవం ఏమిటి? అభిరామ్‌పై అభినయ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అభినయ ప్రేమను ఏ విధంగా అభిరామ్ పొందుతాడు. అభినయని పెళ్లి చేసుకోవడానికి అభిరామ్ ఏలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఇది నా లవ్‌స్టోరి సినిమా.
కన్నడ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడంలో దర్శకుడు రమేష్ గోపి తడబాటుకు గురైనట్టు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. సన్నివేశాల నిడివి పెరిగిపోవడం సినిమాకు ప్రధానంగా మైనస్ పాయింట్. ఇక మితిమీరిన డైలాగ్స్ ప్రేక్షకుడిని సినిమాపై దృష్టి కేంద్రీకరించకుండా చేస్తాయి
Recommended