జమిలిపై బీజేపీ-కాంగ్రెస్ దూరం

  • 6 years ago
జమిలి ఎన్నికలపై పలు పార్టీల అభిప్రాయాన్ని లా కమిషన్ సేకరించింది. టీఆర్ఎస్ సహా నాలుగు పార్టీలు జమిలికి ఒకే చెప్పగా, టీడీపీ సహా తొమ్మిది పార్టీలు వ్యతిరేకించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఏ అభిప్రాయం చెప్పలేదు. తాము ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. జమిలిపై లా కమిషన్ రెండు రోజుల పాటు సంప్రదింపులు నిర్వహించింది. ఆదివారం ముగిసింది. ఈ సంప్రదింపులకు కాంగ్రెస్, బీజేపీ దూరంగా ఉన్నాయి.
సంప్రదింపుల్లో టీఆర్ఎస్, ఎన్డీయే భాగస్వామ్య పక్షం అకాలీదళ్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు జమిలికి మద్దతు పలికాయి. టీడీపీ, జేడీఎస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఫార్వార్డ్ బ్లాక్‌, బీజేపీ భాగస్వామ్య పక్షమైన గోవా ఫార్వార్డ్‌ పార్టీలు జమిలిని వ్యతిరేకించాయి. ఈ నెలాఖరు వరకు అభిప్రాయం చెప్పాలని బీజేపీకి లా కమిషన్ సూచించింది. విపక్షాలను సంప్రదించాక నిర్ణయం చెబుతామని కాంగ్రెస్ తెలిపింది.

Political parties were divided on the issue of holding Lok Sabha and assembly polls simultaneously with four supporting the idea and nine opposing it, even as the ruling BJP and the main opposition Congress stayed away from a consultation organised by the Law Commission on the subject.
#bjp
#congress
#trs
#simultaneouspolls
#onenationoneelection
#jdu