5 years ago

PV Sindhu, Kidambi Srikanth enter Malaysia Open semifinals

Oneindia Telugu
Oneindia Telugu
Kidambi Srikanth and PV Sindhu stormed into the semifinals of the Malaysia Open BWF World Tour Super 750 tournament in Bukit Jalil on Friday. While Srikanth had it easy against Brice Leverdez of France 21-19, 21-11, Sindhu survived anxious moments before prevailing over Carolina Marin of Spain 22-20, 21-19 in the quarterfinals.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసియా ఓపెన్‌ మహిళ సింగిల్స్‌లో సెమీఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో తన ప్రియతమ ప్రత్యర్థి స్పెయిన్ ప్లేయర్ కరోలిన్ మారిన్‌ను 22-20, 21-18 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. తొలి సెట్‌లో మరో రెండు పాయింట్లు సాధిస్తే మారిన్‌ గెలిచే స్థితిలో సింధు అద్భుతంగా పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో విజృంభించిన తెలుగు తేజం.. 12-6 తేడాతో ముందంజ వేసింది. తర్వాత ఆధిక్యాన్ని 14-15కి తగ్గించినప్పటికీ.. 21-18 తేడాతో సెట్‌ను సింధుకు కోల్పోయింది.
మరో పక్క ఇదే టోర్నీలో కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగిస్తున్నాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఫ్రాన్స్‌కి చెందిన బ్రైస్‌ లెవెర్డెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో అలవోక విజయం అందుకున్న శ్రీకాంత్ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రీకాంత్.. 21-18, 21-14తో వరుస సెట్లలో విజయం సాధించాడు. భారత షట్లర్ దూకుడుతో కేవలం 39 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగిసిపోయింది.
#kidambisrikanth
#pvsindhu
#malaysiaopen
#CarolinaMarin
#BriceLeverdez

Browse more videos

Browse more videos