M S Dhoni's Wife Sakshi For License

  • 6 years ago
Mahendra Singh Dhoni’s wife Sakshi Singh Rawat has applied for License citing to her life.

ప్రాణ హాని ఉందని, తనకు గన్ లైసెన్స్ కావాలని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పిస్టల్ లేదా 0.32 రివాల్వర్ లైసెన్స్ ఇప్పించాలని సాక్షి తన అప్లికేషన్‌లో పేర్కొంది.
క్రికెట్‌ మ్యాచ్‌ల దృష్ట్యా ధోని ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. నా కూతురితో కలిసి నేను మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా. ఏదైనా పని కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినా ఒక్కదాన్నే వెళ్లాలి. నా భద్రతను దృష్టిలో పెట్టుకునే నాకు లైసెన్స్‌డ్‌ తుపాకీ లేదా రివాల్వర్‌ ఇప్పించాలి' అని సాక్షి కోరింది.
2008లో ధోని గన్ లైసెన్స్ కోసం జార్ఖండ్ హోం డిపార్ట్ మెంట్‌కు అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఈ దరఖాస్తుని కేంద్ర హోం శాఖకు పంపడంతో కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. అయితే, 2010లో మహేంద్ర సింగ్‌ ధోనీకి 9ఎమ్‌ఎమ్‌ పిస్టల్‌కు అనుమతి వచ్చింది.
ప్రస్తుతం ధోని ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమతున్నాడు. ఇటీవల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో యో-యో టెస్టులో కూడా ధోని పాసైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రికెట్‌ అకాడమీలోనే ప్రాక్టీస్‌ సెషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నాడు.

Recommended