Samantha Akkineni Speaks About Her Ex-Boyfriend

  • 6 years ago
Samantha, in a recent interview with a Telugu daily, spoke about her ex-boyfriend. She compared him to Gemini Ganesan's character from Mahanati (Nadigaiyar Thilagam in Tamil).

వరుస సక్సెస్‌లతో సమంత అక్కినేని సంతోషంలో మునిగి తేలుతున్నది. 2018 సంవత్సరం తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో సమంతకు బాగా కలిసివచ్చింది. ఆమె నటించిన రంగస్థలం, మహానటి, ఇరంబు తిరై చిత్రాలు ఘన విజయాలను సాధించిపెట్టాయి. ఈ చిత్రాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. సమంత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడి గురించి ప్రస్తావించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నా జీవితంలో ఒకరితో సన్నిహితంగా మెదిలాను. నా మాజీ ప్రియుడు మహానటిలో జెమినీ గణేషన్ లాంటి వాడు. అతడి ప్రవర్తన ముందే కనిపెట్టి జాగ్రత్త పడ్డాను. లేకపోతే నేను పెద్ద ప్రమాదంలో పడేవాడిని అని సమంత వెల్లడించారు.
నా ప్రియుడి వ్యవహారం చాలా సందేహాత్మకంగా ఉండేది. సావిత్రి మాదిరిగా నేను చేసివుంటే నా జీవితంలో తీరని మానసిక క్షోభను అనుభవించేదానిని. నేను అతడి గురించి ముందుగానే జాగ్రత్త పడటం అదృష్టంగా భావిస్తాను. అతడితో తెగతెంపులు చేసుకోవడం నాకు మేలు జరిగింది అని సమంత పేర్కొన్నారు.
నా జీవితంలో నాగచైతన్య ప్రవేశించడం దేవుడి వరంగా భావిస్తాను. చైతూ మంచి మనసు ఉన్న అద్బుతమైన వ్యక్తి అని సమంత ప్రశంసలతో ముంచెత్తారు. జెమినీ గణేషన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ద్వారా మహానటి సావిత్రి జీవితం నాశనమైన సంగతి తెలిసిందే.

Recommended