Gemini Ganesan Daughter Comments On Savitri

  • 6 years ago
Gemini Ganesan's daughter Kamala Selvaraj seems to be unhappy over Mahanati movie. “Savitri had multiple relationships, and one of them was with Gemini,” said Kamala. She has also accused the team of ‘not researching enough’. “My father didn’t influence Savitri to become an alcoholic. He did the best to give her dignity and protection, because he loved her truly. Also, Gemini Ganesan was a top actor, who was on par with MG Ramachandran and Sivaji Ganesan. But in the film, he is shown to be jobless and hanging around the sets of Savitri’s films all the time. There’s no mention of his fan-following in the film.”

మహానటి చిత్రం రిలీజైన తర్వాత సావిత్రి వ్యక్తిగత జీవితం, జెమినీ గణేషన్‌తో వైవాహిక జీవితం, ఇతర అంశాలు మరోసారి మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సావిత్రి భర్త జెమినీ గణేషన్ మొదటి భార్య కూతురు కమలా సెల్వరాజ్ మీడియాకు వెల్లడించిన సంచలన విషయాలు చర్చనీయాంశమయ్యాయి.
మహానటి చిత్రంలో తన తండ్రి జెమినీ గణేషన్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా పాత్రను చిత్రీకరించారని కమలా సెల్వరాజ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నా తండ్రిని ఫ్లాప్ హీరోగా చిత్రీకరించారు. అదే సమయంలో సావిత్రిని సక్సెస్‌ఫుల్ నటిగా చూపించారు. ఇది వాస్తవాలకు విరుద్ధం అని ఆమె అన్నారు.
సావిత్రికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. అందులో మానాన్న ఒకరు అని కమలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానటి చిత్రం రూపొందించే క్రమంలో చిత్ర యూనిట్ సరిగా పరిశోధన చేయలేదు. మా నాన్న ఫ్యాన్ ఫాలోయింగ్ లేదన్నట్టు చూపించడం దారుణం, అవకాశాలు లేకుండా సావిత్రి వెంట షూటింగులకు తిరిగారనే విధంగా జెమినీ గణేషన్‌ పాత్రను మలిచారు అని అన్నారు.
సావిత్రి తాగుడుకు బానిస కావడానికి కారణం మా నాన్న కాదు. సావిత్రి అంటే ఆయనకు చెప్పలేనంత ప్రేమ. అందుకే ఆమె ప్రతిష్ఠకు భంగం కలుగకుండా చర్యలు తీసుకొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో రక్షణగా ఉండేందుకు ఆయన చాలా ప్రయత్నించారు అని కమలా సెల్వరాజ్ తెలిపారు.

Recommended