IPL 2018 : Dhoni Credits Chennai's Lower Order After Nervy Win Over SRH

  • 6 years ago
Chennai Super Kings (CSK) stormed into the Indian Premier League (IPL) final for the seventh time on Tuesday after a thrilling last-over win over SunRisers Hyderabad (SRH). CSK skipper Mahendra Singh Dhoni credited his team's lower order who played a key role towards the end of the match.
#Dhoni
#SunrisersHyderabad
#ChennaiSuperKings
#IPL2018

ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టును ఓటమితో వెనక్కి నెట్టింది చెన్నై. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై 140పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఒకానొక దశలో వరుస వికెట్లు కోల్పోయి.. పరుగులు రాబట్టడం భారంగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో క్రీజులో నిలదొక్కుకుని బాధ్యతనంతా తన భుజాలపై నడిపించాడు డుప్లెసిస్.
చివరి వరకూ ఆడి జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. ఆ విజయానందంలో మునిగిన చెన్నై జట్టు సంబరాలు చేసుకుంటుండగా కెప్టెన్.. ధోనీ ఆ ఘనతని డుప్లెసిస్‌తో పాటు మరికొందరికి సైతం ఆపాదిస్తున్నాడు.
'చాలా సంవత్సరాలుగా జట్టు తరపున ఆడుతున్న ప్రతి ఒక్కరూ బాగా ఆడారు. అసలు ఈ విజయానికి కారణం డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొనే ఆహ్లాదకరమైన వాతావరణమే వారిని తీవ్రమైన ఒత్తిడిలో కూడా ఇంతటి చక్కటి ఆటతీరు ప్రదర్శించేలా చేసింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు కనుక లేకుంటే అంతా విరుద్ధంగా ఉండేది. డుప్లెసిస్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించడానికి గల కారణం కూడా ఇదే.' అని పేర్కొన్నాడు.
గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్‌లో చక్కటి జోడీని పొందగలిగాం. లీగ్ ఆరంభం నుంచి బౌలర్లను మారుస్తూ ప్రయోగాలు చేస్తూనే వచ్చాం.' అని ధోనీ వెల్లడించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అతి చిన్న 140పరుగుల లక్ష్యాన్ని లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు చక్కగా ఆడగలిగారు. దీనిపై హైదరాబాద్ జట్టు కెప్టెన్ మాట్లాడుతూ.. 'ఇది లీగ్‌లోనే చక్కటి గేమ్. ఈ మైదానం కేవలం 140పరుగులు మాత్రమే చేసేది కాదు. ఇంకా 20పరుగులు వరకూ చేయాల్సింది' అని పేర్కొన్నాడు.

Recommended