IPL 2018: DD vs CSK Match Preview

  • 6 years ago
A formidable Chennai Super Kings (CSK) will be aiming to tie loose ends ahead of the playoffs when they take on a listless Delhi Daredevils in a dead rubber here on Friday (May 18).
#ChennaiSuperKings
#DelhiDaredevils
#IPL2018
#Dhoni
#Watson

ఐపీఎల్ 2018 సీజన్ చరమాంకానికి చేరుకుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు పోటీపడుతున్నాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్ మాత్రం.. చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో.. ఈరోజు రాత్రి ఫిరోజ్ షా కోట్ల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడేయాలని ఢిల్లీ ఆశిస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకోవాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం 18 పాయింట్లతో హైదరాబాద్ నెం.1 స్థానంలో ఉండగా.. చెన్నై 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే.. నెట్‌రన్‌ రేట్‌లో మాత్రం హైదరాబాద్‌ కంటే.. చెన్నై జట్టే మెరుగ్గా ఉంది.
సీజన్ ఆరంభం నుంచి ఓపెనర్లు అంబటి రాయుడు, షేన్ వాట్సన్ చెన్నైకి మెరుపు ఆరంభాల్ని ఇస్తుండగా.. మిడిలార్డర్‌లో సురేశ్ రైనా, ధోనీ, బ్రావో నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లుగా మలుస్తున్నారు. గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు మెరుపు శతకం బాది.. ఆ జట్టుకి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. మరోవైపు ఢిల్లీ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా, జేసన్ రాయ్ మెరుగ్గా ఆడుతుండగా.. మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ హిట్టింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. మ్యాచ్ జరగనున్న కోట్ల మైదానం‌లో బౌండరీ లైన్ చిన్నదిగా ఉండటంతో.. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

Recommended