గుంటూరులో మరో నిర్భయ కేసు : వివాహితపై మైనర్ అత్యాచారం.

  • 6 years ago
The incidents of Spoiling being reported across the country reached a new low on Tuesday when a minor boy was charged with spoiling and brutalising a 26-year-old woman in Guntur district. The accused, a 16-year-old daily-wager, is on the run while the victim is recovering from her injuries in a hospital.

మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొచ్చినా కానీ, ఈ తరహ ఘటనలు మాత్రం ఆగడం లేదు. గుంటూరు జిల్లాలో నిర్భయ తరహ ఘటన చోటు చేసుకొంది.
భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న మహిళపై కన్నేసిన ఓ యువకుడు బాధితురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలో చోటు చేసుకొన్న నిర్భయ ఘటన తరహాలో బాధితురాలిని చిత్ర హింసలకు గురిచేశాడు.
రాత్రంతా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. బాధితురాలి ప్రైవేట్‌ పార్ట్స్‌లో తీవ్ర గాయాలున్నట్టుగా వైద్యులు చెబుుతున్నారు.
గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో దారుణం చోటు చేసుకొంది. పిడుగురాళ్ళ మండలం జూలకల్లుకు చెందిన బాధితురాలికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మ వద్దే ఆమె పెరిగి పెద్దదైంది. అయితే ఏడేళ్ళ క్రితం కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. కొడుకు పుట్టిన తర్వాత భర్త ఆమెను ఇంటి నుండి తరిమేశాడు. దీంతో అదే గ్రామంలో వివాహిత మరో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటుంది. అయితే రెండు రోజుల క్రితం బాధితురాలి ఇంట్లోకి దూరిన సైదులు అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపర్చాడు.

Recommended