ECB Unveils Plans For Tournament With 100-Ball Format
  • 6 years ago
The England and Wales Cricket Board sprung a surprise on Thursday by announcing it has dispensed with Twenty20 for the new eight-team city tournament and will instead adopt a format of 100 balls per inning.

ఆరంభం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక కొత్త ఫార్మాట్‌లు ఎన్నో తెరపైకి వచ్చాయి. టెస్టులు.. వన్డేలు.. ట్వంటీ20 క్రికెట్.. టీ10 క్రికెట్‌లను ఇప్పటికే చూశాం. క్రికెట్‌కి పుట్టినిల్లైన ఇంగ్లండ్ కొత్త విధానాన్ని తీసుకురానుంది. 2003లో ఇంగ్లండ్ కౌంటీల్లోకి 20-20 క్రికెట్‌ను ప్రవేశపెట్టింది.
ప్రపంచ క్రికెట్లో పొట్టి క్రికెట్‌కు ఊహించని స్థాయిలో అసాధారణ ఆదరణ లభించింది. తాజాగా మరో కొత్త ఫార్మాట్ ఇన్నింగ్స్‌లో 100 బంతులతో క్రికెట్ ఆడేలా నూతన ప్రతిపాదనలను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెరపైకి తీసుకొచ్చింది.
ఈసీబీ చేసిన ప్రతిపాదన క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎనిమిది నగరాల మధ్య పోటీ ఏర్పాటు చేసి, 100 బంతులతో కూడిన కొత్త రకం ఫార్మాట్‌ను తమ దేశీయ క్రికెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు అభిమానులకు ఒకింత ఆశ్చర్యంతో పాటు, గందరగోళానికి గురి చేసింది.
ఈ ఫార్మాట్‌లో 6 బంతులతో కూడిన 15 ఓవర్లు.. 10 బంతులతో కూడిన ఓ ఓవర్‌తో మొత్తం 100 బంతులు ఉండేట్లుగా ప్లాన్‌ చేస్తున్నామని బోర్డు తెలిపింది. ఈ ప్లాన్‌ గనుక కార్యరూపం దాల్చితే 2020 ఏడాది నుంచి నూతన ఫార్మాట్‌ను చూడొచ్చని పేర్కొంది. ఈసీబీ ప్రకటనపై ఇప్పుడు ట్విటర్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలోని దేశవాళీ క్రికెట్‌లో ముందుగా ఈ నూతన ఫార్మాట్‌ను ప్రయోగాత్మకంగా మొదలెట్టాలని భావిస్తున్నారు.
Recommended