MS Dhoni To Receive Padma Bhushan
  • 6 years ago
Mahendra Singh Dhoni. On this date, in 2011, the cricketer guided India to a World Cup triumph with that historic six at the Wankhede Stadium. And in 2018, he is all set to be conferred with the Padma Bhushan on this same date.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితంలో మరిచిపోలేని రోజు ఏప్రిల్ 2. ధోని జీవితంలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ధోని నాయకత్వంలోని టీమిండియా 2011లో ఇదే రోజున భారత అభిమానులుక రెండో వన్డే వరల్డ్ కప్‌ని అందించింది.
వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా వాంఖడె స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. రెండోది ఏరోజైతే ధోని వరల్డ్ కప్ నెగ్గాడో అదే రోజుని ధోనిని పద్మభూషణ్ అవార్డు వరించింది. ధోనితో పాటు బిలియర్డ్స్ ఛాంపియన్ పంకజ్ అద్వానీని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనుంది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ధోని పద్మభూషణ్ అవార్డు అందుకోనున్నాడు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ధోనితో పాటు పంకజ్ అద్వానీ కూడా పద్మ భూషణ్ అందుకునే క్రీడాకారుల జాబితాలో ఉన్నాడు. అయితే సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజున టీమిండియాకు ధోని వరల్డ్‌కప్ అందించడం విశేషం.
భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలకు గాను ఇంతకముందే భారత ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించింది. ఇప్పుడు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌తో సత్కరించనుంది. ఆదివారం పద్మ అవార్డులను గెలుచుకున్న 41 మందికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విందు ఇచ్చారు.
సోమవారం జరిగే పద్మ అవార్డుల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ ఏడాది 84 మందిని పద్మఅవార్డులు వరించాయి. ఇందులో ముగ్గురికి పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 72 మందిని పద్మశ్రీ అవార్డులతో సత్కరించనున్నారు.
Recommended