Kamal Haasan Party Launch : KTR Calls Kamal As 'Nayakan'
  • 6 years ago
Telangana minister KTR responded on Hero Kamal Hassan invitation to his political meeting held in madurai on Wednesday.

తమిళనాట రాజకీయ అరంగేట్రం చేస్తున్న ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు అభినందనలు తెలిపారు. బుధవారం కమల్ హాసన్ తన పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.
కమల్ రాజకీయ పార్టీని ప్రకటిస్తున్న సందర్భంగా బుధవారం సాయంత్రం మదురైలో నిర్వహించబోతున్న సభకు తనను కూడా ఆహ్వానించారని కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
రాజకీయాల్లో ప్రవేశిస్తున్న సందర్భంగా మదురైలో నిర్వహిస్తున్న సభకు నన్ను కూడా పిలిచినందుకు కమల్ హాసన్‌జీకి ధన్యవాదాలు. భౌతికంగా నేను ఈ కార్యక్రామానికి రాలేపోతున్నాను' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు
కమల్ నూతన ప్రస్థానం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. నిజ జీవితంలోనూ ‘నాయకన్'గా మీరు(కమల్) బాగా రాణించాలని కోరుకుంటున్నాను' అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కాగా, కమల్ తన మదురై సభకు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పలువురు నేతలను ఆహ్వానించారు. ఈ సభలో కమల్ తన రాజకీయ పార్టీ పేరును, గుర్తును ప్రకటించనున్నారు. బుధవారం కమల్ హాసన్ తన రాజకీయ యాత్రను ప్రారంభించారు.
బుధవారం ఉదయం చెన్నై నుంచి రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటికి వెళ్లారు. అనంతరం మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కమల్ తన రాజకీయ యాత్రను కొనసాగించారు. కమల్ చేపట్టిన యాత్రకు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు.
Recommended