Kamal Hassan Party Launch Update

  • 6 years ago
Kamal Hassan visited the house of late President Dr. APJ Abdul Kalam in Rameshwaram, before he addressed a gathering of fishing community in the coastal town in southern Tamil Nadu today.

బహుబాష నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయ యాత్ర బుధవారం ఉదయం ప్రారంభమైంది. కమల్‌ హాసన్ భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం స్వస్థలం రామేశ్వరం చేరుకుని కలాం సోదరుడు మహమ్మద్‌ ముతుమీర లెబ్బాయ్‌కు చేతి గడియారం కానుకగా ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకు ముందు హీరో కమల్ హాసన్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సమాధిని దర్శించుకుని నివాళులు అర్నించారు. అనంతరం మత్య్సకారులతో భేటీ అయిన కమల్ హాసన్ శ్రీలంక అధికారుల నుంచి మిమ్మల్ని రక్షిస్తామని, చేతకాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని అన్నారు.
సాధారణ గృహాల్లో నివసించడంలోనే గొప్పతనం ఉందని, అబ్దుల్ కలాం వంటి గొప్ప వ్యక్తి పుట్టిన రామేశ్వరం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, నా జీవితం ధన్యం అయ్యిందని హీరో కమల్‌ హాసన్ ట్వీట్ చేశారు.
అబ్దుల్ కలామ్ సోదరుడు మహమ్మద్ ముతుమీర్ లెబ్బాయ్, ఆయన కుటుంబ సభ్యులు కమల్ హాసన్ కొత్త పార్టీ విజయం సాధించి పేదలకు మంచి చెయ్యాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అబ్దుల్ కలామ్ ఆశీర్వాధం కమల్ హాసన్ కు ఎప్పుడూ ఉంటుందని మహమ్మద్ ముతుమీర్ లెబ్బాయ్ మీడియాకు చెప్పారు.
అబ్దుల్ కలామ్ ఇంటి నుంచి బయలుదేరిన హీరో కమల్ హాసన్ అనంతరం రామేశ్వరంలోనే మత్స్యకారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంలో తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం మీద కమల్ హాసన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
మత్య్సకారుల సంక్షేమం కోసం తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నేరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యిందని కమల్ హాసన్ విమర్శించారు. మత్స్సకారులకు ఇచ్చిన హామీలు ఎందుకు నేరవేర్చలేదని తమిళనాడు ప్రభుత్వాన్ని కమల్ హాసన్న నిలదీశారు.

Recommended