YS Jagan Fools People name of MPs resignation
  • 6 years ago
If the mass resignation of MPs is aimed at forcing by-elections, then the provisions of the Representation of People’s Act, especially Section 151 (A), could stand in the way. The section clearly states that no by-poll will be conducted to a vacant seat if the remainder period of their term is less than a year.

ఏపీకి ప్రత్యేక హోదాపై మార్చి 5 నుంచి పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు ఆందోళనలు చేస్తారని, ఏప్రిల్ 6వ తేదీ లోపు కేంద్రం దిగి రాకుంటే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. జగన్ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో తాము రాజీనామా చేస్తామని వైసీపీ చెబుతోంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదంతా డ్రామా అని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు, జగన్ పక్కా ప్లాన్‌తోనే ఈ ప్రకటన చేశారని, రాజీనామాలు చేసినా నష్టం లేదనే ఉద్దేశ్యంతోనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కలిగిరిలో ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా జగన్ ఎంపీల రాజీనామా అంశాన్ని ప్రకటించారు. జగన్ ప్రకటన ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజేసింది. అయితే అదంతా వట్టిదేనని, అంతా డ్రామాలు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.
జగన్ ప్రకటన వెనుక పెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు. తమ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తారని జగన్ చెప్పారని, కానీ ఎన్నికల నియమావళి ప్రకారం ఒక ఎంపీ స్థానం ఖాళీ అయితే ఉప ఎన్నికలు ఆరు నెలల లోపు నిర్వహించాలని, ఒకవేళ సాధారణ ఎన్నికలు సంవత్సరంలోపు ఉంటే ఉప ఎన్నికలు రావు అని అంటున్నారు.
చట్ట ప్రకారం ఎంపీలు స్వచ్చంధంగా రాజీనామా చేయాలి. సెక్షన్ 151(ఏ) ఇదే చెబుతోంది. అంతేకాదు, ఈ సెక్షన్లో మరో విషయం స్పష్టంగా ఉందని అంటున్నారు.
ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. కానీ ఎంపీలు రాజీనామా చేస్తే దానిని పేర్కొనరాదు. ఎంపీలు ఎవరి ఒత్తిడితోను రాజీనామాలు చేయవద్దు. స్వచ్చంధంగా చేయాలి. రాజీనామా పత్రంలో కారణాలు వెల్లడించవద్దు. ఒకవేళ కారణం చెబితే.. అదే చూపిస్తూ రాజీనామాను తిరస్కరిస్తారు.
మరో కారణం ఏమంటే లోకసభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ వెంటనే రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని లేదు. రాజీనామా ఈ సమయంలోపు ఆమోదించాలని లేదు. వారు ఆమోదించిన తర్వాతే ఖాళీ అవుతుంది. దానిని ఈసీకి తెలియజేస్తారు. ఆ తర్వాత ఈసీ ఉప ఎన్నికకు సిద్ధమవుతుంది. కానీ సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు అయితే ఉప ఎన్నిక నిర్వహించరు.
Recommended