TDP MP Sivaprasad Takes A Dig At Modi & Reveals Chandrababu's Strength

  • 6 years ago
TDP MP Sivaprasad expressed his dissatisfaction over Union Budget 2018-19 that was presented by Arun Jaitley. As the Budget failed to showcase much towards the state, Chittoor TDP MP Siva Prasad has staged a diverse protest

ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ టీడీపీ, వైసీపీ ఎంపీలు లోకసభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ గళమెత్తారు. మరోవైపు పెట్రోల్ ధరల పెంపుపై టీఎంసీ నిరసన తెలిపింది. కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు నిరసనలకు దూరంగా ఉన్నారు.
ఎంపీ హుకుం సింగ్ మృతి నేపథ్యంలో ఆయనకు లోకసభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత సభను మంగళవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో నోయిడా ఫేక్ ఎన్‌కౌంటర్ పైన విపక్షాలు నిరసన తెలిపాయి. మరోవైపు ఏపీ ఎంపీలు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.రెండు సభలు వాయిదా పడిన అనంతరం టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఏపీకి బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని, విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని వారు వాపోయారు.
ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు సహనంతో ఉన్నారని, ఆయన సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. ఆయన ఆగ్రహిస్తే కనుక పరిస్థితులు విషమిస్తాయని హెచ్చరించారు. మోడీ ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు. ఏపీ ప్రజలు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలన్నారు. లేదంటే వార్ డిక్లేర్ చేసినట్లే అని అబిప్రాయపడ్డారు.
రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ నిరసన తెలిపారు. వివిధ అంశాలపై మరిన్ని విపక్షాలు నిరసన తెలిపాయి. ఢిల్లీ ఫేక్ ఎన్‌కౌంటర్ పైన నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.రాజ్యసభలో కేవీపీ ఓ సమయంలో ప్లకార్డు పట్టుకొని పోడియంలోకి వెళ్లి తన నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా కొందరు కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంతగా సర్ది చెప్పినా వినలేదు. ఈ సమయంలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ప్రశ్నోత్తరాల సమయం వద్దా అని నిలదీశారు. సభలో ఇలాగేనా ప్రవర్తించేది, దయచేసి వెనక్కి వెళ్లండని చెప్పారు.

Recommended