Chandrababu Naidu Angry On Arun Jaitley
  • 6 years ago
Telugu Desam Party president and Chief Minister N Chandrababu Naidu on Friday observed that the BJP too will do injustice to the state like that of Congress party.

కేంద్రం వైఖరి ఇలాగే ఉంటే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే ఉత్తమమని, మన కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలతో రాజీనామా చేయిద్దామని టీడీపీ ఎంపీలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎదుట కుండబద్దలు కొట్టారని తెలుస్తోంది. శుక్రవారం టీడీపీ ఎంపీలు, మంత్రులతో చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే.
సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో చంద్రబాబు, ఎంపీలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో అన్యాయం, ఏపీకి ఇచ్చిన హామీలపై తొలి విడతలో ఆందోళనలు నిర్వహించినా, మార్చి 5 వరకు గడువు విధించినా కేంద్రంలో ఎలాంటి కదలిక లేదని ఈ భేటీ సందర్భంగా ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు రాజీనామా వద్దని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామని, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారన్న భావన ప్రజల్లో రావొద్దన్నారు.
ఇప్పటికిప్పుడు కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే బీజేపీ.. టీడీపీని మరో ప్రతిపక్షంలా చూస్తుందని, కాబట్టి రాష్ట్రాన్ని న్యాయం జరిగేలా పోరాడాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఒకేసారి అస్త్రాలు అన్ని ఉపయోగించకుండా దశలవారిగా ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 5న ఎంపీలు ప్లకార్డులతో వెల్లోకి వెళ్తారని, ఆ తర్వాత ఆర్థిక బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తారని, ఫలితం లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.
వైసీపీ అవిశ్వాస తీర్మానంపై భేటీలో చర్చ జరిగింది. వాళ్ల నిర్ణయం వాళ్లు తీసుకున్నారని, అదే దారిలో మనం వెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు. వైసీపీకి ఎవరు మద్దతిస్తారనే చర్చ జరిగింది. అదే సమయంలో బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ డిక్లరేషన్ అంటూ బీజేపీ ఉప ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం సరికాదని చంద్రబాబు అన్నారు. రేపు ఉత్తరాంధ్ర ప్రజలను కూడా రెచ్చగొడతారా అని మండిపడ్డారు.
Recommended