Arun Jaitley Again Disappointed AP
  • 6 years ago
TDP leaders met Union Finance Minister Arun Jaitley on the issue of benefits from the central government to Andhra Pradesh according to the State Division Act.

కచ్చితంగా చేసి తీరితే తప్ప.. 'చేస్తాం.. చూస్తాం' అన్న కేంద్రం మాటలకు ఎప్పుడో గడువు దాటిపోయింది. ఏపీ ప్రజలంతా ఢిల్లీకి చేరి మరీ హోదా కోసం నినదిస్తున్నవేళ.. మళ్లీ పాత పాటే పాడి ఏపీతో పరాష్కం ఆడుతున్నట్టే కనిపిస్తోంది కేంద్రం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల భేటీ తర్వాత వచ్చిన ప్రకటన వింటే ఇదే అభిప్రాయం కలగకమానదు.

హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం చెబుతున్న మాట పాతదే. తాజా భేటీ అనంతరం కూడా.. ఇదేదో కొత్తగా తీర్మానించేసినట్టు బీజేపీ నేతలు మళ్లీ అదే మాట చెప్పారు. మరోవైపు యనమల రామకృష్ణుడు మాత్రం ప్రత్యేక హోదా కావాల్సిందేనని పట్టుబట్టినట్టు చెబుతున్నారు. లేదంటే రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కూడా జైట్లీతో చెప్పినట్టు పేర్కొన్నారు. అంటే, ఇరువురి మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్యాకేజీ నిధుల విషయంలో కేంద్రం వహించిన అలసత్వ ధోరణి.. ఇప్పుడు టీడీపీ మళ్లీ హోదా గళాన్ని ఎత్తుకొనేదాకా తీసుకొచ్చింది. అయినా సరే కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. న్యాయపరమైన హక్కులు, రెవెన్యూ లోటు వంటి విషయాలపై మరోసారి సమావేశమై చర్చిద్దామని జైట్లీ చెప్పినట్టు చెబుతున్నారు. దీంతో ఇంకెన్నాళ్లు ఇలా చర్చలతోనే కాలయాపన చేస్తారన్న అసహనం రాష్ట్రంలో వ్యక్తమవుతోంది.
Recommended