రాత్రంతా నా భార్య నిద్రపోలేదు.. 'అనుష్క'కు థ్యాంక్స్:

  • 6 years ago
Ramcharan praised Anushka Shetty's acting in “Bhagmati” after watching the movie. Cherry said his wife could't sleep last night.

ఒక హీరో సినిమాను మరో హీరో అభినందించడం.. ఇతర హీరోల సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకోవడం.. ఇండస్ట్రీలో ఆరోగ్యకర పోటీకి సంకేతం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆరోగ్యకర వాతావరణమే కనిపిస్తోంది. పెద్ద హీరోలు సైతం వేరే హీరోల సినిమాలపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. తాజాగా హీరో రాంచరణ్ అనుష్క 'భాగమతి'పై స్పందించడం విశేషం.
రాత్రి 'భాగమతి' సినిమా చూశాను. అనుష్క నటన మైండ్ బ్లోయింగ్. టెక్నికల్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. టీమ్ అంతా చాలా కష్టపడింది. వారందరికీ శుభాకాంక్షలు.' అని చెర్రీ ట్వీట్ చేశారు.
సినిమా చూశాక తన భార్య ఉపాసన రాత్రంతా నిద్రపోలేదని.. అందుకు 'భాగమతి'కి థ్యాంక్స్ అంటూ చెర్రీ ఓ సరదా ట్వీట్ చేశారు. బహుశా 'భాగమతి' నిద్రలోనూ ఆమెను వెంటాడి ఉంటుంది.
తన భార్య రాత్రంతా నిద్రపోలేదని చెర్రీ చేసిన సరదా కామెంట్ కు అంతే సరదాగా ఆ చిత్ర యూనిట్ కూడా స్పందించింది. 'జనాలను నిద్రపోనివ్వకూడదనే మా లక్ష్యం నెరవేరింది. రాంచరణ్ గారు థ్యాంక్స్.. మా కష్టాన్ని గుర్తించినందుకు' అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.

Recommended