ట్రంప్‌కు షాక్.. మూతపడిన అమెరికా ప్రభుత్వం..!

  • 6 years ago
US government shuts down as Congress fails to overcome standoff over spending and immigration. Last-minute negotiations crumbled as Senate Democrats blocked a four-week stopgap extension in a late-night vote, causing the fourth government shutdown in a quarter century.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిర్ణీత కాల వ్యవధిలో ద్యవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. దీంతో ప్రభుత్వ వార్షిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి.
యూఎస్‌ సెనేట్‌లో జనవరి 19(శుక్రవారం సాయంత్రం)లోగా ద్యవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. అయితే డెమోక్రాట్లు, రిపబ్లికన్‌ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు.
బిల్లు పాస్ కావడానికి మొత్తం 60 కావాల్సి ఉండగా.. 48 ఓట్లు వ్యతిరేకంగా పడటంతో బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. ఈ కారణంగా అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి.
1981 నుంచి అమెరికాలో ఈ విధంగా ప్రభుత్వం మూతపడటం ఇది 12వ సారి. ఈ కారణంగా అమెరికా ప్రభుత్వానికి వారానికి రూ.42వేల కోట్ల నష్టం వాటిల్లనుందని అంచనా. ప్రభుత్వం మూతపడటంతో ఉద్యోగులకు 40రోజుల పాటు వేతనం లేని సెలవులు ప్రకటించారు.

Recommended