కేంద్ర బడ్జెట్, హమీలపై కసరత్తు.. ఆ కుటుంబాలకు భారీ ఊరట..!
  • 6 years ago
With just 20 days to go for its last budget, the central government has asked departments to go through the BJP’s 2014 manifesto and list out all the promises that have not been fulfilled yet.

కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు తన చివరి బడ్జెట్ ప్రతిపాదించడానికి కేవలం 20 రోజులు మాత్రం మిగిలి ఉంది. ఈ స్థితిలో గత ఎన్నికల సమయంలో చేసిన హామీల్లో ఏవి అమలు కాలేదనే వాటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ విషయాలను తెలియజేయాలని అన్ని శాఖలను అప్రమత్తం చేశారు.
వికలాంగులను చూసుకోవాల్సిన కుటుంబాలకు ఎక్కువ ఊరట కలిగించే విధంగా పన్నులు ఉండేలా చూడాలని సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ సూచించింది. వచ్చే బడ్జెట్‌లో ఆ మేరకు ఆర్థిక మంత్రి ప్రతిపాదలు చేస్తారని ఆశిస్తున్నారు.
వికలాంగులు గల కుటుంబాలకు 80డిడి కింద వ్యక్తులకు, హిందు అవిభాజిత కుటుంబాలకు తగిన మినహాయింపులు ఇస్తూ వస్తోంది. పన్ను చెల్లించే వ్యక్తిపై ఆదారపడినవారు భార్య లేదా భర్త, పిల్లలు, తండ్రి, తోబుట్టువులు కావచ్చు. ప్రస్తుతం 40 శాతం కన్నా ఎక్కువ 80 శాతం కన్నా తక్కువ వికలత్వం ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ప్రభుత్వం రూ.75 వేల ఊరట కలిగిస్తోంది. 80 శాతం ఎక్కువ వికలత్వం ఉంటే ఆ ఊరట లక్షా 25 వేల రూపాయల వరకు ఉంది.
Recommended