రియల్ 'హీరో' మాటలు కాదు, చేతల్లో చేసి చూపిస్తున్నాడు..!

  • 6 years ago
It is well-known that Superstar Mahesh Babu adopted two villages, his hometown Burripalem in Andhra and Siddhapuram in Telangana. The developmental works in both these villages are being supervised by Mahesh's wife.

కొందరుంటారు.. మాటలు చెప్పమంటే కోటలు దాటుతాయి. సమస్య పరిష్కారం సంగతి పక్కనపెడితే.. మైకుల ముందు మాత్రం గంటలు గంటలు ఆదర్శాల గురించి స్పీచులు దంచుతారు. వీళ్ల వల్ల పెద్దగా ఉపయోగమేమి లేదు.
కానీ ఇంకొందరు ఉంటారు.. చాలా తక్కువ మాట్లాడుతారు, సందర్భం వచ్చినప్పుడు చేతల్లోనే తమ సత్తా ఏంటో చూపిస్తారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కోవకే చెందుతారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒక గ్రామాన్ని, తెలంగాణలో మరో గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. కేవలం ఆదర్శాల కోసమే ఈ ప్రకటనలు చేసి ఊరుకోలేదు మహేష్. ఈ రెండు గ్రామాల అభివృద్ది పట్ల చిత్తశుద్దితో, నిజాయితీతో వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరైన బుర్రెపాలెంను దత్తత తీసుకున్న మహేష్ బాబు.. ఇప్పటికే ఆ గ్రామాన్ని చాలావరకు అభివృద్ది చేశారు. ఇక రెండో దత్తత గ్రామమైన మహబూబ్ నగర్ లోని సిద్ధాపురం గ్రామ అభివృద్దిపై మహేష్ ప్రస్తుతం ఫోకస్ చేశారు.

Recommended