రియల్ "హీరో" అంటే నువ్వే..!

  • 7 years ago
Actor Vijay Sethupathi has said he would donate a share of his remuneration towards the education of the needy.

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతీ నటుడూ, నటి సాధారణం గా చెప్పే మాట "కళమీద ఉన్న ఇష్టం తోనే సినిమాల్లోకి వచ్చాను" అని, కానీ దాని వెనుక ఉన్న నిజం అందరికీ తెలిసిందే, ఎప్పటికప్పుడు తమ రెమ్యున రేషన్ల లెక్కలు చూసుకునే హీరోలు, హీరోయిన్లూ కొన్ని సార్లు మాత్రం ఆ డబ్బు ఎలావచ్చిందన్న ఆలోచన చేస్తారు. అప్పుడే వాళ్ళు సినీ హీరోలనుంచి రియల్ హీరోలు గా మారతారు...
వరదలు, భూకంపాలూ వంటి ఉత్పాతాల సమయం లో మన హీరోలు విరాళాలు ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు, అయితే మన హీరోలకంటే ఎక్కువగా తమిళ హీరోలే ఈ విషయం లో ముందుంటారు, ఒక సంధర్భం అని ప్రత్యేకంగా లేకుండా వారు ఈ తరహా సహాయాలు చేస్తూనే ఉంటారు.
సినిమాల్లోనే కాకుండా వివిద ఎండార్స్మెంట్లలో సంపాదించింది కూదా తమ అకౌంట్లలో జమ చేసుకునే హీరోలు ఉన్న సమయం లో తాను చేసిన ఒక యాడ్ కోసం అందుకున్న పారితోషికం మొత్తాన్నీ పేద పిల్లలకోసం ఇచ్చిన తమిళ హీరో విజయ్ సేతుపతి రియల్ లైఫ్ హీరోల జాబితాలో చేరి కోలీవుడ్ హాట్ టాపిక్ అయ్యాడు...
ఓ కంపెనీ ప్రకటనలో నటించినందుకుగాను ఆయనకు అందిన రూ.50లక్షల పారితోషకాన్ని పేద విద్యార్థుల కోసం విరాళంగా ఇచ్చారు. తమిళనాడులోని ఓ కంపెనీకి ప్రచారకర్తగా ఇటీవలే విజయ్‌ సేతుపతి ఒప్పందం కుదుర్చుకున్నారు.

Recommended