ఏపీలో ఏం జరుగుతుందో నో క్లారిటీ : జనసేన - లెఫ్ట్ పార్టీ - టీడీపీ కలయిక ?
  • 6 years ago
CPI Narayana on Thursday praised Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu after Amaravati visit. He lashed out at PM Modi.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరికీ తెలియదు. ఏ పార్టీలు ఎప్పుడు కలుస్తాయో, ఏ పార్టీలు ఎప్పుడు విడిపోతాయో ఎవరూ చెప్పలేరు. తెలంగాణలో 2019లో పోటీ విషయమై దాదాపు చాలా స్పష్టంగా ఉంది. అనూహ్య నిర్ణయాలు లేకుంటే.. దాదాపు అన్ని పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశముంది. ఏపీలో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎవరు ఎవరితో కలుస్తారు, ఇప్పుడున్న టీడీపీ - బీజేపీ వచ్చే ఎన్నికల్లోను కొనసాగేనా... అనే అంశంపై స్పష్టత లేదు. పైస్థాయిలో సంబంధాలు బాగున్నాయని చెబుతున్నారు. కానీ మాటల్లోని స్నేహం చేతల్లో కనిపించడం లేదని అంటున్నారు.
సీఎం చంద్రబాబుకు దాదాపు ఏడాది తర్వాత ప్రధాని మోడీ అపాయింటుమెంట్ దొరికింది. పోలవరం, కాపర్ డ్యాం, ప్రత్యేక ప్యాకేజీ.. తదితర అంశాలపై కేంద్రంపై టీడీపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. మరోవైపు కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని, వాటిని టీడీపీ తమ ఖాతాలోకి వేసుకుంటోందని, కేంద్రానికి మంచి పేరు రాకుండా చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాజాగా, సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. మళ్లీ టీడీపీ - లెఫ్ట్ పార్టీలు జత కట్టనున్నాయా, దీని కోసం ఎవరైనా పని చేస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. గతంలో టీడీపీ - లెఫ్ట్ పార్టీలు కలిసి పని చేశాయి. ఇప్పుడు పని చేస్తాయా అనేది చూడాలి. అయితే నవ్యాంధ్రకు కేంద్రం అండ అవసరం కాబట్టి టీడీపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరమే. మరోవైపు బీజేపీలోని కొందరు నేతలు కూడా ఏపీలో ఎదిగేందుకు ఒంటరిగా పోటీ చేయడమే ఉత్తమం అని భావిస్తున్నారు.
Recommended