'అజ్ఞాతవాసి' సైకిల్ సీన్ పై కామెంట్స్ !

  • 6 years ago
Power star Pawan Kalyan has been in news ever since his Agnyaathavaasi was officially announced. It's no news that the actor-politician enjoys a huge fan following across the globe.

జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల్లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రంపై ఫ్యాన్స్ నుంచి సానుకూల స్పందన, ప్రేక్షకుల నుంచి ప్రతికూలత వ్యక్తమవుతున్నది. ఇలా డివైడ్ టాక్‌తో దూసుకెళ్తున్న అజ్ఞాతవాసి చిత్రంలోని ఓ సన్నివేశంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. అదేమిటంటే..
అజ్ఞాతవాసి కథలో భాగంగా ఏబీ అనే కంపెనీలో పవన్ కల్యాణ్ సైకిల్ ఎక్కి మురళీశర్మను ఆటపట్టిస్తాడు.
పవన్ కల్యాణ్ సైకిల్ ఎక్కి మురళీ శర్మను ఛేజ్ చేయడాన్ని చూసి ‘చిన్నప్పటి నుంచి ఆ అల్లుడి (పవన్‌ను ఉద్దేశించి)కి ఉన్న సైకిల్ మోజు ఇంకా కొనసాగుతునే ఉంది అని తనికెళ్ల భరణి ఓ కామెంట్ విసురుతాడు.
అలాగే ఓ సందర్భంలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మళ్లీ సైకిల్ ఎక్కుతాడా? అని వర్మ (రావు రమేష్)తో మురళీశర్మ అంటాడు. అందుకు సమాధానంగా వర్మ బదులిస్తూ.. వాడు ఏది ఎక్కినా ఫర్వాలేదు. మనల్ని ఎక్కుకుండా ఉంటే చాలూ అని అంటాడు.

Recommended