అజ్ఞాతవాసి పై తారల కామెంట్స్

  • 7 years ago
Power star Pawan Kalyan's most awaited First look and Title Agnathavaasi announced. After announcement of title, Its goes viral in the social media. Sai Dharam Tej, Kajal, Mehrin Pirzada, Shalini Pandey responded to first look with interesting comments in twitter.

పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి‌ చిత్ర ఫస్ట్‌లుక్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని పవిత్ర గంగానదిలో సోమవారం ఉదయం అజ్ఞాతవాసి‌ టైటిల్‌ను పవన్, త్రివిక్రమ్, ఇతర యూనిట్ సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి‌ వాసి ఫస్ట్‌లుక్ వైరల్‌గా మారిన నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, జవాన్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
అజ్ఞాతవాసి‌ టైటిల్, ఫస్ట్‌లుక్ ప్రకటించగానే సూపర్‌గా ఉంది అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ ఎన్నడూ ఉపయోగించవద్దు. అదీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్‌లుక్ వచ్చినప్పుడు అసలే సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయవద్దు. మీరే చూడండి అజ్ఞాతవాసి‌ ఫస్ట్‌లుక్‌ను అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అజ్ఞాతవాసి‌ ఫస్ట్‌లుక్, టైటిల్‌పై టాలీవుడ్ గోల్డెన్ లెగ్ మెహ్రీన్ ఫిర్జాదా స్పందించారు. వావావావా...వ్. పవర్‌ఫుల్‌గా కొత్త అవతారంలో పవర్‌స్టార్ వచ్చేశాడు. ఇదిగో అజ్ఞాతవాసి‌, పీఎస్‌పీకే25 ఫస్ట్‌లుక్ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

Recommended