Daily Horoscope దిన ఫలాలు 27-12-2017

  • 6 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.


తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 27 వ తేదీ బుధవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస శుద్ద నవమి రాత్రి 8 గంటల 16 నిమిషముల వరకు వుంది. రేవతి నక్షత్రం రాత్రి 8 గంటల 16 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడానికి మక్కువ చూపుతారు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. వృషభ రాశి వారు చేయు పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి. బంధు మిత్రుల కలయికలు వుంటాయి. పని వారి సహకారం పూర్తిగా వుంటుంది. మిధున రాశి వారికి వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. సోదరుల సహచరుల సహకారం వుంటుంది. కర్కాటక రాశి వారికి తండ్రి గారి సహాయ సహకారాలు పొందుతారు. బంధు కలయికలు వుంటాయి. తల్లి గారి ఆశీర్వాదం పొందుతారు. సింహ రాశి వారికి ఆరోగ్యం విషయం లో శ్రద్ద వహించాలి. దైవ దర్శన ప్రాప్తి కలదు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కన్య రాశి వారికి చేయు పనుల యందు విజయం సాధిస్తారు. ధన ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు బాగా జరుగుతాయి. తుల రాశి వారికి చేయు పనులు సుభ ఫలితాలని ఇస్తాయి. అవకాశాలు చేజారకుండా చూసుకోవలసి వుంటుంది. పిల్లలతో శ్రద్దగా మసులుకోవలసి వుంటుంది. వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేయవలసి వుంటుంది. పిల్లల కోసం చేసే పనులు సుభ ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ధనూ రాశి వారు ఆరోగ్య విషయం లో జాగ్రత్త అవసరం. ఇంటి పనులు బాధ్యతగా చేస్తారు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. బంధు మిత్రు కలయికలు వుంటాయి. మకర రాశి వారికి దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేయు పనుల యందు ఆటంకాలు వుంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కుంబ రాశి వారికి ధన ప్రణాళికలు అనుకున్న ఫలితన్నిస్తాయి. పని వారి సహకారం వుంటుంది. అధికారులు మెప్పు కుడా పొందుతారు. దూరపు సమాచారం వింటారు. మీన రాశి వారు మనసు ఆనందంగా వుంటుంది. అనుకున్న పనులు జరుగుతాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు.



Recommended