Daily Horoscope Telugu దిన ఫలాలు 21-12-2017

  • 6 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 21 వ తేదీ గురువారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస శుద్ద తదియ సాయంత్రం 5 గంటల 14 నిమిషముల వరకు వుంది. ఉత్తరాషాడ నక్షత్రం మద్యాహ్నం 2 గంటల 32 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి కొరకు ప్రణాళికలు వేస్తారు. భార్య సహకారం తో ప్రణాళికలు పూర్తి చేస్తారు. తండ్రి గారి సహకారం వుంటుంది. వృషభ రాశి వారు దూర బంధు వార్తలు వింటారు. పని వారి సహకారం వుంటుంది. మిధున రాశి వారికి తలచిన పనులు ఆటంకాలు వుంటాయి. కొత్త అవకాశాలు చేజారే సమయం. ధన ఇబ్బందులుంటాయి. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు భార్య సహకారం తో పూర్తి చేస్తారు. ఇంటి పనుల యందు శ్రద్దగా చేయవలసి వుంటుంది. సింహ రాశి వారికి దైవ దర్శన ప్రాప్తి కలదు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కన్య రాశి వారికి ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. పని వారి సహకారం వుంటుంది. తుల రాశి వారికి చేయు పనులు సుభ ఫలితాలను ఇస్తాయి. భార్య అనుకూలంగా ఉండగలదు. వృశ్చిక రాశి వారు దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. ధన ప్రణాళికలు కార్య రూపం దాల్చుతాయి. రావలసిన సొమ్ము చేతికందుతుంది. ధనూ రాశి వారు ధన ప్రణాళికలు అనుకులిస్తారు. ధనానికి కొరత వుంటుంది. తలచిన పనులు పూర్తి చేస్తారు. మకర రాశి వారికి అనుకున్న పనులు జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. కుంబ రాశి వారికి బంధు మిత్రుల కలయికలుంటాయి. పనివారి సహకారం కూడా వుంటుంది. మీన రాశి వారికి చేయు పనుల యందు ఆటంకాలు వుంటాయి. భార్య సహకారం వుంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు.

Recommended