రేప్ చేస్తే మరణ శిక్ష : వెంటపడి వేధించినా రూ.లక్ష జరిమానా ! | Oneindia Telugu

  • 7 years ago
The cabinet of Shivraj Singh Chouhan in Madhya Pradesh has decided to push for capital punishment for people who target children aged 12 years and less

అత్యాచారాలను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతుండడంతోప్రభుత్వం కఠిన నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత కరువైందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దాంతోప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించాలన్న తీర్మానానికి ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళలపై సామూహిక అత్యాచారం చేసే నిందితులకు కూడా మరణ శిక్ష విధించేందుకు పచ్చజెండా ఊపింది. అత్యాచారం రుజువైన పక్షంలో నిందితులకు విధించే శిక్ష, జరిమానా మొత్తాన్ని పెంచేందుకు సైతం శిక్షా స్మృతిని సవరించేందుకు కూడా అంగీకారం తెలిపింది.మహిళలపై అత్యాచారయత్నం చేసినా, వెంటపడి వేధించినా రూ.లక్ష జరిమానా విధించాలని నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి ఈ శీతాకాల సమావేశాల్లో శాసనసభలో బిల్లు ప్రతిపాదిస్తామని ఆర్థిక మంత్రి జయంత్‌ తెలిపారు. రాష్ట్రంలో బాలికలపై అఘాయిత్యాలను నియంత్రించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఎన్‌సీఆర్‌బీ రికార్డుల ప్రకారం దేశంలో అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది.

Recommended