India Not Ready To Play Cricket With Pakistan | Oneindia Telugu
  • 6 years ago
Legendary Pakistan bowler Wasim Akram has hailed the India-Pakistan rivalry as one of the best, but said that Pakistan can't force India to play cricket.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేలా భారత్‌ను ఒప్పించే సత్తా ఐసీసీకి లేదని వసీం అక్రమ్ విమర్శించాడు. దీని ఫలితంగా భారత్‌-పాక్‌ యువ క్రికెటర్లు ఒకరితో ఒకరు ఆడలేకపోతున్నారని అన్నాడు.
అంతేకాదు ఇరు దేశాలకు చెందిన క్రీడా సంబంధాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐని శాసించే సత్తా ఐసీసీకి లేదనడానికి ఇదే ఒక ఉదాహరణ అని అక్రమ్ మండిపడ్డాడు. 'పాకిస్థాన్‌తో సిరీస్‌లో తలపడేందుకు భారత్‌ను ఒప్పించే శక్తి ఐసీసీకి ఉందని అనుకోవడం లేదు. క్రీడలను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలి' అని అక్రమ్ అన్నాడు.
Recommended