మరో విషాదంలో హీరో రాజశేఖర్..

  • 7 years ago
Rajasekhar's house tragedy An elder brother Murali Srinivas died shortly thereafter. Murali suffered from some illness for some time and finally came to the last breath in the early morning.
హీరో రాజశేఖర్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఆయన తల్లి మరణించగా, ఆ బాధ నుంచి తేరుకోకముందే, ఈ తెల్లవారుఝామున జీవిత సోదరుడు, రాజశేఖర్ బావమరిది మురళీ శ్రీనివాస్ హైదరాబాదులో కన్నుమూశారు. గతజూన్ లోనే కిడ్నీ సంబందిత సర్జరీ జరిగింది అప్పటినుంచీ ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది.
2011 లో డ్రగ్స్ మాఫియాలో కూడా మురళీ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపించింది. 305 గ్రాముల కొకైన్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మురళీ శ్రీనివాస్ ఆ కేసు తర్వాత మళ్ళీ ఎప్పుడూ పెద్దగా వార్తల్లో కనిపించలేదు.
కాగా, రాజశేఖర్ నటించిన తాజా చిత్రం 'పీఎస్వీ గరుడవేగ' రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఈ సమయంలో కుటుంబంలో విషాదం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Recommended