IPS Officer Arrested for Cheating In UPSC Mains Examination | Oneindia Telugu

  • 6 years ago
afeer Karim, who secured the 112th rank in the 2014 UPSC examination, wanted to be an IAS officer. He was caught using a Bluetooth device to speak to his Hyderabad-based wife, who was dictating the answers.
ఐపీఎస్ అధికారి సఫీర్ కరీంను చెన్నై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. యూపీఎస్‌సి(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షల్లో బ్లూటూత్ ఆధారంగా అతను మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. బ్లూటూత్ లో తన భార్య సమాధానాలు చెబుతుంటే.. సఫీర్ కరీం పలు ప్రశ్నలకు సమాధానాలు రాసినట్టు పోలీసులు నిర్దారించారు. కరీంను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సెక్షన్-420(మోసం, అనైతికత) కింద కేసు నమోదు చేశారు. కరీంను టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్ నుంచి కరీం భార్య అతనికి సమాధానాలు చేరవేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న భార్యకు బ్లూటూత్ కెమెరా సహాయంతో ప్రశ్నాపత్రాన్నిస్కాన్ చేసి పంపించాడు కరీం. హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్రంగా స్టడీ సర్కిల్ 'లా ఎక్సలెన్సీ అకాడమీ' నుంచి కాపీయింగ్ జరిగినట్టు గుర్తించారు. గతంలో భార్యతోను ఇస్రో సంబంధిత పరీక్షను కరీం ఇలాగే రాయించినట్టు గుర్తించారు. కాగా, కేరళకు చెందిన ఐపీఎస్ సఫీర్ ఐఏఎస్ అయేందుకు యూపీఎస్‌సి పరీక్షలు రాస్తున్నారు.