ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ గురించి చాలా విని ఉంటారు. శత్రు రాకెట్లను, మిస్సైళ్లను గాల్లోనే అంతం చేస్తుంది ఈ ఐరన్ డొమ్. కవచంలా పని చేసి నగరాలను, ప్రజల ప్రాణాలను సురక్షితంగా ఉంచుతుంది.అదే మాదిరిగా, టర్కీ రూపొందిస్తున్న స్టీల్ డోమ్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. కేవలం భూమి మీదనే కాకుండా సముద్రంపై కూడా మిస్సైళ్లను అడ్డుకునేలా టర్కీ.. స్టీల్ డోమ్ ను డిజైన్ చేస్తోంది.అన్ని దేశాలు తమ జీడీపీలో 5 శాతం డిఫెన్స్ కోసం ఖర్చు చేయాలని ఇటీవల నాటో సమావేశంలో ట్రంప్ సూచించారు. టర్కీ దానికి అంగీకరించి, స్టీల్ డోమ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రంప్ సూచనకు స్పందనగా టర్కీ తమ డిఫెన్స్ బడ్జెట్ ను పెంచుకుంటోంది.స్టీల్ డోమ్ కేవలం ప్రాథమిక రక్షణ వ్యవస్థ మాత్రమే కాదు.. ఇది మల్టీ లేయర్ డిఫెన్స్ వ్యవస్థ. ఇందులో పవర్ ఫుల్ సెన్సార్లు కలిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేస్తుంది. కాబట్టి శత్రువు మిస్సైల్ టార్గెట్ హిట్ చేసే ముందే దాన్ని కనిపెట్టి ప్రతిస్పందిస్తుంది.స్టీల్ డోమ్ లోని మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది భూమిపైనా, సముద్రంపైనా పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే టర్కీకి అన్ని వైపులా పూర్తిస్థాయి రక్షణ కవచం లభిస్తుంది.రిపోర్ట్స్ ప్రకారం.. స్టీల్ డోమ్ ను ఇప్పటికే అంకారా, అక్యూ న్యూక్లియర్ ప్లాంట్ల వద్ద ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో దేశమంతా ఈ సిస్టమ్ విస్తరించనుంది టర్కీ. స్టీల్ డోమ్ లో షార్ట్, లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ఉంటాయి. అలాగే, ఇంటర్ సెప్టర్లు కూడా ఉంటాయి. ఇవి అన్ని కలిసి తమవైపు వస్తున్న ఎలాంటి శత్రు దాడులనైనా గాల్లోనే అడ్డుకుంటాయి.ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తో ఎలా రక్షణ పొందుతుందో, టర్కీ కూడా స్టీల్ డోమ్ ద్వారా శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవాలనుకుంటోంది. ఇది కొత్త ఎయిర్ డిఫెన్స్ రేస్ కి నాందిగా చెప్పవచ్చు. ఈ చర్యలు ప్రపంచంలో ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చూపిస్తోంది.