AI Hackathon At Guntur: పోలీసింగ్‌లో కృత్రిమ మేధ సేవలను విస్తృతంగా వినియోగించుకునేందుకు వీలుగా ఏపీ పోలీసు విభాగం తొలిసారిగా జాతీయ స్థాయిలో ఏఐ హ్యాకథాన్‌కు శ్రీకారం చుట్టింది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని నేరాల కట్టడి చేయాలనే లక్ష్యంతో యువతను ఇందులో భాగస్వామ్యం చేశారు. గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో 36 గంటల ఏఐ హ్యాకథాన్‌కు అంకుర సంస్థలు, ఐటీ నిపుణులు, ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. పోలీసులకు రోజువారీ అవసరాల్లో కీలకమైన 8 అంశాల్లో ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చనే దానిపై 53 బృందాలు తమ ఆలోచనలతో ప్రాజెక్టులు తయారు చేసేందుకు పోటీ పడ్డాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మొదలైన 36 గంటల హ్యాకథాన్ ఆదివారం ఉదయంతో ముగిసింది. తాము రూపొందించి ఏఐ అప్లికేషన్ ఎదుటి వ్యక్తికి ఏ భాషలో చెప్పినా పోలీసులకు అవసరమైన భాషలోకి అనువదిస్తుందంటున్న యువ ఇంజినీర్లతో చిట్‌చాట్.