Software Engineer Drama Artist Sai Shankar: ఆదరణ తగ్గుతున్న నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే ఆ యువకుడి జీవిత ఆశయం. పద్యనాటకంపై ఆసక్తితో చిన్నప్పట్నుంచి పద్య నాటకంలో సాధన చేస్తున్నారు. చదువులోనూ రాణిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించినా, కళపై ఉన్న అభిరుచిని వదల్లేదు. మంచి జీతం వస్తున్నా రిలాక్స్ అవ్వకుండా వీకెండ్లో నాటకాలు వేస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ ప్రదర్శనలతో సత్తా చాటుతూ పద్య నాటకమే శ్వాసగా సాగిపోతున్నారు సాయి శంకర్.