Sri Rama Navami Shobha Yatra In Telangana : శ్రీరామ నవమిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. జానకీ రాముల వివాహ వేడుక అనంతరం శోభాయాత్రలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. సీతారాంబాగ్ నుంచి మొదలై కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వద్ద యాత్ర ముగిసింది. జై శ్రీరామ్ నినాదాలతో భాగ్యనగర వీధులు మార్మోగిపోయాయి.