Aneesh Excelling in Roller Hockey : బాల్యం నుంచి ఆటలంటే ఇష్టం. అందులోనూ భిన్నమైన క్రీడలో రాణించాలనే ఉత్సాహం ఆ యువకుడిది. అలా చిన్నతనంలోనే స్కేటింగ్లోకి ఆడుగుపెట్టాడు. అనతికాలంలోని నైపుణ్యాలు ఒడిసిపట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు. రోలర్ హాకీ నుంచి ఇన్లైన్ రోలర్ హాకీలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నాడు.