SEEDAP MOU WITH ISB: రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్తను తయారుచేయాలనే లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)తో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ఉపాధి కల్పన వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (SEEDAP) ఛైర్మన్ దీపక్‌రెడ్డి తెలిపారు. యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 24 సెక్టార్స్‌లో శిక్షణ కోసం ఐఎస్బీతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదం సాకారం చేసేందుకు ఐఎస్బీతో కొన్ని కోర్సులకు ఎంవోయూ చేసుకున్నామని అన్నారు.