Peddireddy Land Grabs in Mangalampeta : కోడి గుడ్లు పెట్టినట్టో మేక పిల్లల్ని కన్నట్టో భూమి కూడా పిల్లల్ని కంటుందని ఎప్పుడైనా విన్నారా? పోనీ పిల్లలు ఎదిగినట్టుగా భూమి కూడా రోజురోజుకూ పెరగడం ఎక్కడైనా చూశారా? అలాంటి అద్భుతాన్ని చూడాలంటే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీప అడవుల్లో వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సిందే. అక్కడ భూమి రోజురోజుకూ పెరుగుతోంది. నమ్మకశక్యం కావడం లేదా? అయితే ఈ స్టోరీ చూసేయండి.